నాలుగు పయ్యల బండి
నాలుగు పయ్యల బండి నా గురించే ఒస్తదా
కిటికీ సీట్ కోసం డబ్బా కట్టుకొని దబ్బునొస్తే
ఇగో రాదు అగొ రాదూ
తింటే బస్సుకు ఆలస్యం అయితదని ఆగం ఆగంల
అటుకుల డబ్బా కట్టుకొని ఒచ్చిన
పట్నం పోతున అని నిద్ర కూడా వోలె
ఊరంతా చెప్పిన ఒత్తిగనన్న
ఇట్నుంచి ఇటే ఇంటికి ఓవలనో ఏందో
టైంకు ఒస్తదా అని చూశేందుకు నాకడ గడియారం ఉంటే కదా
అగొ వచ్చే వచ్చే వచ్చే అని ముఠా మూళ్ళ నెత్తిన వెట్టుకొని
తిట్టుకుంటా ఓయ్యి కిటికీ పక్కన సీట్ దొరకావట్టి
కంకర్ రోడ్డు మీద టికెట్టు తీషి అటుకుల మెతుకులు కడుపుల వడ్డంక
దంబార్ రోడెక్కి అటు ఇటు పొలాలు ఎంకకు వొతుంటే సళ్ళ గాలికి నిద్రొచింది
లేశి చూస్తే స్టాప్ ఎల్లిపోయ్యి అద్ద గంటయింది
ఏడనో దిగిన పేరు తెల్వని ఊరు
మల్ల నిలవడ్డ
నాలుగు పయ్యల బండి నా గురించే ఒస్తదా...
Ann,
15 May 2021.
Comments
Post a Comment