చదువు యవ్వనం
తడబడుతున్న అడుగులు
ఆగవు సాగావు
నింగికి ఆశలు
నెలకి చూపులు
నేనంటే నేను
నువ్వు అందవు
నేనొస్తే లేవు
కలలు కోరికలు
తీరని లోటు
ఒంటరి వెంట
ఎగిరిపోతున్న యవ్వనం
చచ్చిపోతున్న ఆకలి
కరిగిపోతున్న కాలం
దూరంలో తీరం
పక్షుల పిలుపులు
చంద్రుడు సూరీడు
చిమ్మ చీకట్లు
నిద్రలేని రాత్రులు
నాన్న జ్ఞాపకాలు
చివరి మాటలు
గుండె రాయి
మౌనంగా కంఠత్తడి
చెప్పలేని కథలు
కరిగిపోయిన కావ్యం
బోలెడు ఆశ
కసింత పని
మనసంతా చింత
పరుగులు పడిగాపులు
ఇంకెంత కాలం
ఇంకెంత దూరం
Comments
Post a Comment