జర నిమ్మళంగ

 నా పేరు తొండగాడు, నా దోస్తు గాన్ పేరు తొండగాడు  అదేంది ఇద్దరు ఒకటే పేరు అంటర మాకు మీకు లాగా పేర్లు ఎవ్వరు పెట్టరు అందరికి ఒకటే పేరు మా పెయ్యి రంగుని బట్టి మమ్మల్ని గుర్తువట్టచ్చు. మేము చెట్ల మీద పుట్టల మీద గుట్టల మీద ఆడుకుంటo తింటం, పడుకుంటం అవే మా జాగలు గవ్వే మా ఇల్లు. మరి మా పని ఆ చెట్టు మీదికెళ్లి ఈ చెట్టుకి తిరగడం. అప్పుడప్పుడు ఆడుకొనికి దాస్కొనికి  వేరే చేట్ల పైకి కూడా ఎక్కుతుంటం మాకు చిన్న కాళ్ళు ఉన్న చాలా వేగంగా పరిగెత్తగలం.

 ఇట్ల నేను తొండగాడు కుష్కుష్ ల ఆడుకుంటున్నం ఆడు నాకు దోరొకద్దని రోడ్కి అటు దికున్న చెట్టు కాడికి నేను ఒకటి రెండు మూడు అని లెక్క వెట్టే లోపే రోడ్డు దిక్కు ఎల్లిపొయ్యిండు.  నేను అడిగురించి ఎత్తుకుంట చెట్లు, చెట్ల తొర్రలు అంత ఎతికి రోడ్డు దాటి అటు పక్కన్న ఉన్న చెట్ల దిక్కు పోయిన. ఎన్ని చెట్లున్నయో అన్ని డోలాడిన ఆడు నాకు దొరకొద్దని ఎంత గట్టిగ అనుకున్నడో అసలు ఏడ కనవడ్తలేదు. ఇగ చూశి చూశి నేను ఓడిపోయిన నువ్వు బైటికి వచ్చేయి అని అరిస్తే కూడా బైటకి ఒస్తలే. చెట్లమీద ఉన్న చీమల్ని పురుగుల్ని అడిగిన మావోడు ఈటెమన్న ఓచిండేమో అని, అటుగా కొమ్మ మీద ఉన్న కాకి బావా కావ్ కావ్ మని అoటుంటే నన్నేనా పిలిశెది అని రయ్యిమని పోదమని అడుగు ముందుకేస్తున్న, ఒద్దు నువ్వు రావొద్దు నేనే వస్తా అని తూర్రుమని వాలిండు. నాతోని రమణ్ణి రోడ్డు దిక్కు కొంచవోయ్యిండు. నేను రోడ్కి అటుఇటు చూస్తుంటే అల్లాదిగో రోడ్డు మద్యల మావోడు కన్నవడ్డడు. కానీ వాడు రోడు దాటలేక అక్కడే ఆగిపోయ్యిండు. దెగ్గరికి పోయి చుస్తే ఆడి కడుపు మీదకెళ్లి బండి టైర్ పోవడం వళ్ళ శరీరం జీవం లేకుండా కళ్ళు పైకి తెలి, రోడ్డు మీద వాడిని గుర్తుపట్టేవాళ్ళు లేకపోవడం వాళ్ళ వాడు శవమై పడిపోయిండు, ఎవర్రు వాడిని కాపాడడానికి రాలేదు చీమలు చుట్టూ ముడుతున్నాయి, వాడిని పట్టుకొని నేను ఇంకో బండి కింద బలికాకుండా రోడ్డుక్కి అటు దిక్కు పొయ్యి వాడి చెట్టు కింద ఒదిలేషి ఒచ్చిన. ఏడుస్తున్న నన్ను ఓదారుస్తూ కాకి బావా చెప్పిండు. మా తొండగాడు దాస్కుందామని దబ దబ రోడ్డు దాటనికి ఊరుకుతుంటే అటు నుండి రెండు చక్రాల బండి మీద ఒకాయన సెల్లఫోన్ మేడ కాడ వెట్టి తల సగం అడ్డం తిప్పి రుయ్యిన వొతూ రోడ్డు మీద ఎం ఉందొ చూసుకోకుండా మావోడి మీదకి బండి ఎక్కించి మళ్ళీ ఎనకకు కూడా చూడకుండా అట్లా ఆ ఫోన్ల మాట్లాడుకుంటా ఓయ్యిండు. ఇది చూశిన కాకి బావా కావ్ కావ్ మని కేక వెట్టిన ఆడి బాషా ఓవ్వరికి అర్థం కాకా ఎవరు పట్టించుకోలేదట. ఆడు ఎంత దోరొకద్దు అనుకుంటే మాత్రం అట్లా నాకు ఎప్పటికి దొరకకుండా వొతడా. ఆడి చెట్టు దిక్కు చూడాలంటే ఏడుపు ఆగుతలే ఆడు లేని ఆ చెట్టు కూడా ఆ రాత్రి బాధతో చిన్నబోయ్యింది.


ఈ మనుషులు ఇట్ల ఆగం ఆగంల సెల్లఫోన్లు మాట్లాడుకుంటా మన లాంటి నోరు లేని తొండలని, సీతకొకచిలుకలను, పిల్లులను, కుక్కలను, ఆవులను, పావురాలను, కూడా గుద్ది ఎల్లిపోతుంటరంట మనము పోతే వాళ్లకేం నష్టం మనం వాళ్ళ ఇంట్లో వాళ్ళం కాదు కాద. ఇట్ల కొన్ని సార్లు వేగంగా నడిపి మనుషలు కూడా గాయపరిచి చావు బతుకుల మద్యల రోడ్లమీద వదిలేస్తారంట  కాకి బావా చెప్పిండు. మరి జర బండ్లు నడిపేటప్పుడు ఫొన్లు మాట్లాడకుండా ఉంటే అల్లకి పక్కనోళ్ళకి మంచిది కద అటు ఇటు చూసి జర మెల్లగా నడుపుతే రెండు నిముషాలు లేట్ అయితే ఎం జెరిగేది ఉంది. మాకు మీలాగా అంబులెన్సు ఆసుపత్రిలు లేవు కానీ మీలాగా అమ్మ నాన్నలు అన్న దమ్ములు అక్కాచెల్లెలు పిల్ల జల్లా అందరు ఉంటరు మాకోసం ఎదురుచూస్సెవాళ్ళు ఉంటరు. నోరు లేనంత మాత్రాన మమ్మల్ని తేలికగా తీసుకోవద్దు. మీ ఇంట్లో ఒకరు పోతే ఎంత బాధపడతారో మేము అంతే. సరే నేను పోత అని కాకి బావా ఎగిరిపోయ్యిండు. నాకు వాడు లేకుండా ఆకలి కూడా అయితలే ఆటలతో చెంగుచేంగుమని ఊరికేటోళ్ళం ఇట్ల కుప్ప కూలిన్నట్టు అయిత అని అనుకోలే. మీరు పైలంగా బండి నడుపుండి. ఫొన్లు వస్తే పక్కన ఆపుకోండి రెండు నిముషాలు లేట్ వొతే ఎం కాదులే, మనకేమన్నా అయితే రోజులు, నెలలు, సంవత్సరాలు జీవితలే కొలిపోతాం. ఈ రాత్రి నుండి తొండగాడు లేకుండా ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకోవాలి.

Comments

Popular posts from this blog

ఎడారి