అద్దం

 గంపేడు గునుగు పువ్వు తెచ్చి

తంబలం నిండ తంగేడు పువ్వులతోని

పొద్దుగాల నుండి పోదమీకే దాకా

అరుగుల అంత నింపి

అమ్మాలకక్కల నోట్ల అన్ని ముచ్చట్లు ఇని

ఎంతంత పెద్ద బతుకమ్మ పెర్షి

ఎన్నెన్ని కథలు అల్లి

యాలయిపాయె అని

కొత్త పట్టు చీర కట్టి

కొప్పుల కనకంబరం వెట్టి

అద్దం ముందు కెళ్ళి జరిగితే

మరి కళ్ళకి కాటుక

నొసలు మీద బొట్టు

ఎట్లా వెట్టేది

నువ్వొస్తే నేనట్ల కనపడాలి

అని అటు తిరిగి

నీకెట్ల కానవాడ్తా అని చూసుకొని

అందాల అలుకు వెట్టి

ముత్యాల ముగ్గులేషి

అద్దం ముందు ముస్తాబాయితుంటే 

అగొ అకిట్ల నిలవడ్డ శివయ్య

ఆగం ఐతుంటే 

అటు ఇటు తిరిగి

ఆగి ఆగి చూస్తే

ఇంకా వస్తాలే

బంగారు బతుకమ్మ

దిద్దుడింక ఓడుస్తలే 




Comments

Popular posts from this blog

ఎడారి

జర నిమ్మళంగ