Posts

ఎడారి

 చెల్లాచెదురుగా పడిన చిన్ననాటి కలలు చీకటి ఒడిలో చిక్కుముల్లను  మబ్బులు కమ్మిన చంద్రుడితో  ఆకలితో అరుబైట కూర్చున్న  నువ్వు వచ్చేవరకు సయిసవడలేక  నీకో ముద్ద పెడధమని ఎడారిలో నీళ్ళు ఎథికినట్టు నీ పేరుని వీధి వీధి లో  చెవులు చేయిల్లిపోయెల కేకలు వేస్తే అరచేతిలో ఉన్న నా ప్రేమ గోరుముద్దనీ  చి చీ అని నువ్వు విసిరి పారేస్తే నేను ఏరుకొని ఎవరికివ్వల్లి చేతులు చాచి శోకం పెట్టిన చిన్న చూపు అయిన చూడలేదు నీకు నేను గుర్తులేదు పేగులు పిసికి గొంతు ఎండి పినిగనై  ఇంటికి చేరితే నువ్వు నాతో ఓస్తవని ఇంటి తలుపు ఎదురుచూస్తూ ఎప్పుెప్పుడా ఇంకా ని ఓడిలో  నువ్వు లేకపోతే ఈ జీవం సజీవదహనం.

కళలు

 nenu kanna kalalu kalalu niduralo kalalu naavevvi nenuu anukunnavi kaadu nenu thappa nakemi sontham kaadu nijamani nenu nammina nammaka thappina nijaniki navaanni kalale ee kalalanni naa uhale kallu thristhe erigipoye rekkala pakshule.

అలసి సలసి

 ఎక్కడెక్కడికో ఎగిరినాయి ఈ రెక్కల ఊహలు  ఎగిరి ఎగిరి అలసి సలసి  అందనంత దూరంలొ వల్లకాటికి వెళ్లినట్టు తిరిగి రాలేదు మళ్ళీ ఇటు చూడలేదు.

ఉషా కిరణం

 సహనం సహకారం ఓర్పు నది తీరం ఆవేశం అహంకారం ఆలోచన అందం అలక మధురం  అసహ్యం నరకం అర్థం వివేకం నిందా అవివేకం  ప్రేమ దైవం ద్వేషం పెనుభూతం తప్పు ఒప్పులు అనేకం మనిద్దరం ఏకం  ఈరోజు అంతం అనంతం అకిలం  నిన్న స్మశానం  రేపు కనలేని కల  ఈరోజు వెన్నెల   నిన్న చిక్కుముడ్ల చీకటి రేపు అంతుచిక్కని రేయి

అద్దం

 గంపేడు గునుగు పువ్వు తెచ్చి తంబలం నిండ తంగేడు పువ్వులతోని పొద్దుగాల నుండి పోదమీకే దాకా అరుగుల అంత నింపి అమ్మాలకక్కల నోట్ల అన్ని ముచ్చట్లు ఇని ఎంతంత పెద్ద బతుకమ్మ పెర్షి ఎన్నెన్ని కథలు అల్లి యాలయిపాయె అని కొత్త పట్టు చీర కట్టి కొప్పుల కనకంబరం వెట్టి అద్దం ముందు కెళ్ళి జరిగితే మరి కళ్ళకి కాటుక నొసలు మీద బొట్టు ఎట్లా వెట్టేది నువ్వొస్తే నేనట్ల కనపడాలి అని అటు తిరిగి నీకెట్ల కానవాడ్తా అని చూసుకొని అందాల అలుకు వెట్టి ముత్యాల ముగ్గులేషి అద్దం ముందు ముస్తాబాయితుంటే  అగొ అకిట్ల నిలవడ్డ శివయ్య ఆగం ఐతుంటే  అటు ఇటు తిరిగి ఆగి ఆగి చూస్తే ఇంకా వస్తాలే బంగారు బతుకమ్మ దిద్దుడింక ఓడుస్తలే 

జర నిమ్మళంగ

  నా పేరు తొండగాడు, నా దోస్తు గాన్ పేరు తొండగాడు  అదేంది ఇద్దరు ఒకటే పేరు అంటర మాకు మీకు లాగా పేర్లు ఎవ్వరు పెట్టరు అందరికి ఒకటే పేరు మా పెయ్యి రంగుని బట్టి మమ్మల్ని గుర్తువట్టచ్చు. మేము చెట్ల మీద పుట్టల మీద గుట్టల మీద ఆడుకుంటo తింటం, పడుకుంటం అవే మా జాగలు గవ్వే మా ఇల్లు. మరి మా పని ఆ చెట్టు మీదికెళ్లి ఈ చెట్టుకి తిరగడం. అప్పుడప్పుడు ఆడుకొనికి దాస్కొనికి  వేరే చేట్ల పైకి కూడా ఎక్కుతుంటం మాకు చిన్న కాళ్ళు ఉన్న చాలా వేగంగా పరిగెత్తగలం.  ఇట్ల నేను తొండగాడు కుష్కుష్ ల ఆడుకుంటున్నం ఆడు నాకు దోరొకద్దని రోడ్కి అటు దికున్న చెట్టు కాడికి నేను ఒకటి రెండు మూడు అని లెక్క వెట్టే లోపే రోడ్డు దిక్కు ఎల్లిపొయ్యిండు.  నేను అడిగురించి ఎత్తుకుంట చెట్లు, చెట్ల తొర్రలు అంత ఎతికి రోడ్డు దాటి అటు పక్కన్న ఉన్న చెట్ల దిక్కు పోయిన. ఎన్ని చెట్లున్నయో అన్ని డోలాడిన ఆడు నాకు దొరకొద్దని ఎంత గట్టిగ అనుకున్నడో అసలు ఏడ కనవడ్తలేదు. ఇగ చూశి చూశి నేను ఓడిపోయిన నువ్వు బైటికి వచ్చేయి అని అరిస్తే కూడా బైటకి ఒస్తలే. చెట్లమీద ఉన్న చీమల్ని పురుగుల్ని అడిగిన మావోడు ఈటెమన్న ఓచిండేమో అని, అటుగా కొమ్మ మీద ఉన్న కాకి బావా కావ్ కావ్

చదువు యవ్వనం

 తడబడుతున్న అడుగులు ఆగవు సాగావు  నింగికి ఆశలు నెలకి చూపులు నేనంటే నేను నువ్వు అందవు నేనొస్తే లేవు కలలు కోరికలు తీరని లోటు ఒంటరి వెంట  ఎగిరిపోతున్న యవ్వనం చచ్చిపోతున్న ఆకలి కరిగిపోతున్న కాలం దూరంలో తీరం  పక్షుల పిలుపులు చంద్రుడు సూరీడు చిమ్మ చీకట్లు నిద్రలేని రాత్రులు నాన్న జ్ఞాపకాలు చివరి మాటలు గుండె రాయి మౌనంగా కంఠత్తడి  చెప్పలేని కథలు కరిగిపోయిన కావ్యం బోలెడు ఆశ కసింత పని మనసంతా చింత పరుగులు పడిగాపులు  ఇంకెంత కాలం ఇంకెంత దూరం